TS HC CJ Raj Bhavan : సీజే ప్ర‌మాణం హాజ‌రైన సీఎం

రాజ్ భ‌వ‌న్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

TS HC CJ Raj Bhavan : ఊహించ‌ని స‌న్నివేశానికి వేదికైంది తెలంగాణ‌లోని రాజ్ భ‌వ‌న్(TS HC CJ Raj Bhavan). గ‌త తొమ్మిది నెల‌లుగా రాజ్ భ‌వ‌న్ కు రావాలంటూ స్వ‌త‌హాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ ఆహ్వానం ప‌లికినా సీఎం ప‌ట్టించు కోలేదు.

చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమెపై కూడా టీఆర్ఎస్ మంత్రులు విమ‌ర్శించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

తాజాగా ఉప్పు నిప్పు లాగా ఉంటూ వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ , సీఎం కేసీఆర్ లు ఒకే చోట చేరారు. ఆ స‌న్నివేశానికి వేదికైంది తెలంగాణ రాజ్ భ‌వ‌న్.

తాజాగా మంగ‌ళ‌వారం రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి సీఎం హాజ‌రయ్యారు. దీంతో సీఎం ప్ర‌త్యేకంగా హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రిచుకుంది.

ప్ర‌త్యేకించి ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉండ‌గా సీఎం కేసీఆర్ , గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ప‌క్క ప‌క్క‌నే కూర్చోవ‌డం కూడా అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు రాష్ట్రాల‌కు కొత్త‌గా సీజేల‌ను నియ‌మించింది.

అందులో భాగంగానే తెలంగాణ హైకోర్టుకు జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ను కేటాయించింది. ఇవాళ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఆయ‌న తో త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ సీజేగా ప‌ని చేసిన స‌తీష్ శ‌ర్మ ఢిల్లీకి బ‌దిలీ అయ్యారు. ఆయ‌న స్థానంలో భూయాన్ వ‌చ్చారు.

Also Read : అంకురాల‌కు టీ హ‌బ్ ఆలంబ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!