BRS Candidates List : గులాబీ అభ్యర్థుల లిస్ట్ రెడీ..?
వెల్లడించనున్న బీఆర్ఎస్ చీఫ్
BRS Candidates List : గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలు కానుంది. ఆగస్టు మూడో వారంలో లేదా నెలాఖరులో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించనుంది భారత రాష్ట్ర సమితి(BRS). ఈ మేరకు పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్లు టాక్. అభ్యర్థుల జాబితా కూడా ఖరారైందని, ఈ మేరకు ఎవరికి సీట్లు దక్కుతాయనేది ఉత్కంఠ రేపుతోంది.
BRS Candidates List Will Announce Coming Days
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే పలుమార్లు ఎన్నికలపై చూచాయిగా కేసీఆర్ ప్రకటిస్తూ వచ్చారు. ఈనెల 17న లేదా 19న 90 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటిస్తారని సమాచారం. ఇందులో 80 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా 29 స్థానాలలో కొత్తగా అభ్యర్థులకు కేటాయిస్తారని తెలిసింది. ఇక రెండో జాబితాలో వామపక్షాలకు కూడా కొన్ని సీట్లు కేసీఆర్ కేటాయిస్తారని టాక్.
ఇప్పటి వరకు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో ఆయా అభ్యర్థుల పనితీరు, గెలుస్తారా లేదా అన్న దానిపై సర్వే చేపట్టారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు.
Also Read : Adhir Ranjan Chowdhury : అమిత్ షా వైఫల్యం కాంగ్రెస్ ఆగ్రహం