CM KCR Comment : బీఆర్ఎస్ బాస్ జోష్ ఎన్నికలపై ఫోకస్
హామీల వర్షం కురవనందా ఓట్ల వర్షం
CM KCR Comment : తెలంగాణలో ఏం జరగ బోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దక్షిణాదిన తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ పుంజుకుంది. అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. దీంతో ఈసారి త్వరలో జరగబోయే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. ముచ్చటగా మూడోసారి భారత రాష్ట్ర సమితి పవర్ లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని పూర్తి భరోసాతో ఉన్నారు ఆ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్(CM KCR). ఎన్నికలనే యుద్ద క్షేత్రంలో ఎలా గెలవాలనే దానిపై పూర్తి క్లారిటీ కలిగిన నాయకుల్లో ఒకే ఒక్కడు కేసీఆర్(CM KCR). ప్రతిపక్షాలను కోలుకోకుండా చేయడంలో, అసలైన సమయంలో దెబ్బ కొట్టడంలో, వ్యూహాలు పన్నడంలో, ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా.
ఈసారి తెలంగాణలో త్రిముఖ పోరు కొనసాగనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పాటు బహుజన సమాజ్ పార్టీ కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రతి సభకు జనం భారీగా హాజరవుతున్నా ఎన్నికల కీలక సమయంలో ఓటు ఎవరికి వేస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఏ పార్టీకి. కానీ బీఆర్ఎస్ రథ సారథికి పూర్తి అవగాహన ఉంది. ఇతర పార్టీల నేతల కంటే ముందంజలో ఉన్నారు కేసీఆర్(CM KCR). విద్యార్థి దశ నుంచే రాజకీయాలను అవపోసన పట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఓ వైపు విమర్శలు ఎన్ని వచ్చినా తగ్గకుండా తాను అనుకున్నది చేసి చూపించే సత్తా , దమ్ము కలిగిన నైపుణ్యం, నాయకత్వ ధైర్యం సీఎంకు ఉంది. రాష్ట్రానికి సంబంధించి పూర్తి డేటా ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. పుస్తకాల పరంగా ఎన్ని చదివాడన్నది పక్కన పెడితే ..పూర్తి సమాచారం తెలుసు కోవడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా.
పలు భాషల్లో ప్రావీణ్యం ఆయనకు అదనపు అర్హతగా చెప్పక తప్పదు. జనానికి తమ భాషలోనే చెబితే అర్థం అవుతుందని నమ్మిన వ్యక్తి. అందుకే అవసరమైనప్పుడు అందంగా చెప్పడంలో, అవగాహన కల్పించడంలో సీఎం సక్సెస్ అయ్యారు. ఈ దేశంలో ఇద్దరు నాయకులు మాత్రమే కమ్యూనికేట్ చేయడంలో ముందంజలో ఉన్నారు. వారిలో ఒకరు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరొకరు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ప్రస్తుతం ఎన్నికల వేడి మెల మెల్లగా రాజుకుంటోంది. పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడం, నేతలకు దిశా నిర్దేశం చేసే పనిలో బిజీగా ఉన్నారు. గతంలో కంటే ఈసారి తీవ్రమైన పోటీ ఎదుర్కోనుంది బీఆర్ఎస్. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. దానిని ఎలా అధిగమించాలో ఎన్నికల కంటే ముందు కేసీఆర్ కు కొట్టిన పిండి. మొత్తంగా ఎవరు గెలుస్తారనే దానిని పక్కన పెడితే ఈసారి జరగబోయే శాసనసభ ఎన్నికలు సీఎంకు అగ్ని పరీక్ష. తన కార్యదక్షతకు..పనితీరుకు ఓ సవాల్.
Also Read : Sanjay Singh