CM KCR Compaign : మునుగోడుపై గులాబీ బాస్ ఫోక‌స్

మూడు రోజులు అక్క‌డే మ‌కాం

CM KCR Compaign : తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక అటు సీఎం కేసీఆర్ ఇటు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు స‌వాల్ గా మారాయి. తాము చేప‌ట్టిన అభివృద్ది ప‌నులే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని టీఆర్ఎస్ స‌ర్కార్ భావిస్తోంది. ఇప్ప‌టికే మొత్తం యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మ‌న్లు, ప్ర‌జాప్ర‌తినిధులు అక్క‌డే మ‌కాం వేశారు.

ఇంటింటికీ ప్ర‌చారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే గులాబీ బాస్ కేసీఆర్(CM KCR Compaign) ప‌ర్య‌టించారు..బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఇక గ‌త కొన్ని రోజులుగా గులాబీ ద‌ళ‌ప‌తి ఢిల్లీలో మ‌కాం వేశారు. భార‌త రాష్ట్ర స‌మితిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉత్త‌ర ప్ర‌దేశ్ లో మాజీ సీఎం ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

త‌న‌తో పాటు కూతురు క‌విత‌, సంతోష్ రావును వెంట పెట్టుకుని దేశ రాజ‌ధానిలో ఉన్నారు. కొన్ని రోజుల‌య్యాక హైద‌రాబాద్ కు విచ్చేసిన సీఎం కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఇక నుంచి మూడు రోజుల పాటు మునుగోడులోనే మ‌కాం వేసి ఎలాగైనా స‌రే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు.

తానే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈనెల 28, 29, 30న మునుగోడులో బ‌స్సు యాత్ర‌, రోడ్ షోలలో పాల్లొన‌నున్నారు. ఆఖ‌రి రోజు 30న చండూరులో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్ప‌టికే ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ రావు, మంత్రి కేటీఆర్ లు అక్క‌డే కొలువు తీరారు. ఇక మంత్రుల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు.

Also Read : ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా రెడీ

Leave A Reply

Your Email Id will not be published!