CM KCR : జూనియ‌ర్ కార్య‌ద‌ర్శుల‌కు డెడ్ లైన్

9 లోపు చేర‌కుంటే జాబ్స్ పీకేస్తాం

CM KCR : భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూనియ‌ర్ కార్య‌ద‌ర్శుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు మే 9 లోపు విధుల్లో చేరాల‌ని లేక పోతే ఉద్యోగాలు పీకేస్తామంటూ హెచ్చ‌రించింది. ఈ మేర‌కు డెడ్ లైన్ విధించారు సీఎం కేసీఆర్. గ‌త కొంత కాలంగా ఆందోళ‌న బాట ప‌ట్టారు జూనియ‌ర్ కార్య‌ద‌ర్శులు. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ సుల్తానియా పేరుతో ఈ నోటీసులు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇప్ప‌టికే తెలంగాణ‌తో ఎలాంటి సంబంధం లేని వ్య‌క్తికి నెల‌కు రూ. 1,50,000 వేల జీతంతో వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా నియమించిన స‌ర్కార్ జూనియ‌ర్ కార్య‌దర్శుల ప‌ట్ల ఎందుకు వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తుందో అర్థం కావ‌డం లేదు. జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు ఏప్రిల్ 28 నుంచి స‌మ్మె చేస్తున్నారు. అసోసియేషన్ పిలుపు మేర‌కు ఏప్రిల్ 13న తేదీన ప్ర‌భుత్వానికి స‌మ్మె నోటీసు ఇచ్చారు.

నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆందోళ‌న‌ను స‌మ్మెను ఉధృతం చేశారు. దీంతో ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. వీరు 2019 ఏప్రిల్ 12న విధుల్లో చేరారు. మూడేళ్ల త‌ర్వాత ప‌ర్మినెంట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నాలుగేళ్ల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు క్ర‌మ‌బ‌ద్దీక‌రించ లేదు. దీంతో త‌మ‌ను ఆదుకోవాల‌ని వారు కోరినా ఫ‌లితం లేక పోయింది.

Also Read : ఆర్ఎస్పీ బీఎస్పీ సీఎం – మాయావ‌తి

Leave A Reply

Your Email Id will not be published!