KCR Health : సీఎం ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇవాళ అనుకోకుండా నీరసంగా అనిపించడంతో సీఎం హుటా హుటిన ఆస్పత్రికి వెళ్లారు.
ఆయన తో పాటు సీఎం సతీమణి శోభ, కూతురు కవిత, సంతోష్ రావు ఉన్నారు. సీఎంకు అన్ని పరీక్షలు చేపట్టారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో తనయుడు , మంత్రి కేటీఆర్ సందర్శించి పరామర్శించారు.
ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సీఎంకు అన్ని పరీక్షలు చేశామని , ఎలాంటి గుండె సంబంధిత సమస్యులు లేవని స్పష్టం చేశారు వైద్యులు ఫిజిషియన్ ఎం.వి. రావు, కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్.
సీఎం ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామన్నారు. కేసీఆర్(KCR Health) కు సర్వైకల్ స్పాండిలోనిస్ అని నిర్ధారించడం జరిగిందన్నారు. దీంతో సీఎంకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించామని వెల్లడించారు.
అయితే గత రెండు రోజుల నుంచి కొంచెం నీరసంగా ఉన్నట్లు కేసీఆర్ తమతో తెలిపారని చెప్పారు. ఎడమ చేయి నొప్పిగా అనిపిస్తున్నట్లు చెప్పారన్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించు కోవాలని సూచించామన్నారు.
ఇవాళ సార్ రావడం జరిగిందన్నారు. వైద్య నిపుణులు ఎంవీ రావు, ప్రమోద్ రావు కలిసి కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేశారని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం పదిలంగానే ఉందన్నారు. కాక పోతే రెస్ట్ అవసరమని పేర్కొన్నారు.
ఎ టు జెడ్ పరీక్షలు సీఎం కేసీఆర్ కు నిర్వహించామని అంతా బాగానే ఉందని రిపోర్టులు వచ్చాయని తెలిపారు.
Also Read : 80 వేల 39 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ డిక్లేర్