KCR : ఉన్నట్టుండి అందరికీ షాక్ ఇస్తూ సీఎం కేసీఆర్ (KCR)సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో ఆకస్మిక భేటీ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఆర్థిక కార్యదర్శి తో పాటు మంత్రులు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సబితా , హరీష్ , తలసాని, గంగుల, శ్రీనివాస్ గౌడ్ , ఇంద్రకరణ్ , ప్రశాంత్ , జగదీష్ , కవిత హాజరైనట్లు సమాచారం. వీరితో పాటు స్పీకర్ పోచారం కూడా ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా పాలనా పరమైన అంశాలతో పాటు రాజకీయ చర్చ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఖాళీగా ఉన్న 80 వేల 39 జాబ్స్ భర్తీ చేస్తానని ప్రకటించారు.
కానీ ఈరోజు వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో లాగే మాటలు తప్ప చేతలు ఉండవని నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.
అంతే కాకుండా ఇటీవల ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా కేసీఆర్ తో మింగిల్ కాలేదన్నారు.
ఆయన ఇచ్చిన నివేదికలపైన చర్చించేందుకు సీఎం కేసీఆర్ (KCR)రివ్యూ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ ఎలా చేస్తే పార్టీ మరింత బలపడుతుందనే దానిపై ఆరా తీయనున్నట్లు టాక్.
విచిత్రం ఏమిటంటే పోలీస్ శాఖ జపం చేయడాన్ని నిరుద్యోగులు తప్పు పడుతున్నారు.
Also Read : అమెరికా టూర్ కు కేటీఆర్