KCR Modi : తెలంగాణ అంటే ఫ్ల‌వ‌ర్ కాదు ఫైర్  

మోదీకి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ 

KCR Modi : సీఎం కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు పోరాట వీరుల‌ని వాళ్ల‌తో  పెట్టుకుంటే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి. ఇవాళ టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముగిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు కేసీఆర్.

గ‌తంలో చాలా మంది తెలంగాణ‌తో గోక్కుందామ‌ని ప్ర‌య‌త్నం చేశార‌ని, కానీ భంగ‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, పోరాటాల‌కు కేరాఫ్ తెలంగాణ అన్న విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు.

ఇక్క‌డ కొలువు తీరింది అస‌లు సిస‌లైన తెలంగాణ ఉద్య‌మ బిడ్డ‌ల‌ని చెప్పారు. ఒక వేళ ఖ‌ర్మ కాలి తెలంగాణ‌తో పెట్టుకుంటే మీరే భంగ ప‌డతారంటూ హెచ్చ‌రించారు. విన‌మ్రంగా చెబుతున్నా తెలంగాణ‌తో పెట్టుకోవ‌ద్ద‌ని కోరుతున్నాన‌ని అన్నారు.

మీరు దిగి వచ్చేంత దాకా ఊరుకోబోమ‌న్నారు. మీరు భంగ‌ప‌డ‌టం ఖాయ‌మ‌న్నారు. పంజాబ్ కు అమ‌లు చేస్తున్న విధానాన్నే తెలంగాణ‌కు వ‌ర్తింప చేయాల‌ని  కోరుతున్నాం. కానీ మీరు గ‌త కొంత కాలం నుంచి ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు.

క‌క్ష పూరితంగా, వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నార‌ని ఆరోపించారు. తాను ఊరుకున్నా తెలంగాణ ప్ర‌జ‌లు ఊరుకోర‌న్నారు సీఎం కేసీఆర్(KCR Modi). తాము గొంతెమ్మ కోర్కెలు కోర‌డం లేద‌న్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని సేక‌రించాల‌ని కోరుతున్నామ‌ని చెప్పారు. దేశానికంత‌టికీ ఒకే ఆహార పాల‌సీ ఉండాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

తాము దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కోరుతున్నామ‌ని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల‌కు రాజ్యాంగ ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు సీఎం కేసీఆర్.  దేశంలోని ప్ర‌తి రైతుకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : పార్టీకి విధేయులం వ్య‌తిరేకం కాదు

Leave A Reply

Your Email Id will not be published!