CM KCR : ప్ర‌జాస్వామ్యాన్ని విస్మ‌రిస్తే ప్ర‌మాదం

కేంద్ర స‌ర్కార్ పై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం భార‌త దేశానికి ప‌ట్టు కొమ్మ అనిపేర్కొన్నారు. ఆ విష‌యాన్ని విస్మ‌రిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. అధికారం ఉంది క‌దా అని ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తామంటే కుద‌ర‌ద‌ని తెలుసు కోవాలని సూచించారు కేసీఆర్.

CM KCR Words

ప్ర‌త్యేకించి ప్ర‌జాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌భుత్వం ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. దానిని గౌర‌వించాలే త‌ప్పా అవ‌మానించ కూడ‌ద‌ని సూచించారు కేసీఆర్(KCR). ప్ర‌జ‌ల ఆదేశాల‌కు, అభిప్రాయాల‌కు, ఆలోచ‌న‌ల‌కు విరుద్దంగా వెళ‌తామంటే ఎవ‌రూ ఒప్పుకోర‌న్నారు. గ‌తంలో ఈ దేశంలో ఎంద‌రో ప‌ని చేశార‌ని, కానీ నియంతృత్వ‌పు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ లేద‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్.

ఇక కాదు , కూడ‌ద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ, సంకీర్ణ స‌ర్కార్ వెళ‌తామంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్దం అవుతుంద‌న్నారు సీఎం. అది చివ‌ర‌కు ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితికి దారి తీసే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు కేసీఆర్.

ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. మొత్తంగా కేసీఆర్ ఏది మాట్లాడినా సంచ‌ల‌న‌మే.

Also Read : Manipur Violence : మ‌ణిపూర్ హింస‌పై మౌనమేల‌

Leave A Reply

Your Email Id will not be published!