CM KCR : అసైన్డ్ భూములపై హ‌క్కులు క‌ల్పిస్తాం

తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

CM KCR : షాద్ న‌గ‌ర్ – అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అసైన్డ్ భూముల‌పై హ‌క్కులు క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్. తొలి కేబినెట్ లోనే ఈ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం షాద్ న‌గ‌ర్ లో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్ ను గెలిపించాల‌ని కేసీఆర్(CM KCR) కోరారు.

CM KCR Comment

రైతు బంధును కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆప‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల‌కు 3 గంట‌లు మాత్ర‌మే ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ కావాల్నా తేల్చు కోవాల‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవ‌డం వ‌ల్ల‌నే రైతు బంధు ఆగింద‌ని ఆరోపించారు.

ఆ పార్టీకి మీరు మ‌ద్ద‌తు ఇస్తారా అని ప్ర‌శ్నించారు. తాము తీసుకు వ‌చ్చిన ఈ రైతు బంధు ప‌థ‌కం కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌కు అంద‌డం లేదా అని నిల‌దీశారు. కావాల‌ని అడ్డుకోవ‌డం అంటే రైతుల‌పై మీకు ప్రేమ లేద‌ని అర్థం అవుతోంద‌న్నారు కేసీఆర్.

ఆరు నూరైనా మ‌రోసారి తాము అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బ‌లుపు చూసుకుని వాపు అనుకుంటోంద‌న్నారు సీఎం. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో క‌నీసం 90 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌న్నారు సీఎం.

Also Read : PM Modi : క‌లుస్తాన‌న్న కేసీఆర్ ను వ‌ద్ద‌న్నా

Leave A Reply

Your Email Id will not be published!