CM KCR : ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటం
సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్
CM KCR : తెలంగాణ – బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట, మునుగోడు, వనపర్తి లలో జరిగిన బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. ధరణిని రద్దు చేస్తామంటున్నారు సన్నాసులు. వాళ్లు ఏనాడైనా తెలంగాణ జెండా ఎత్తుకున్నారా అని ప్రశ్నించారు.
CM KCR Comments Viral
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క తెలంగాణలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ , నీళ్ల కష్టాలు తప్పవన్నారు. విపక్షాలు ఆచరణకు నోచుకోని హామీలు తాము ఇవ్వడం లేదన్నారు. గతంలో ప్రభుత్వాలు రూ. 70, రూ. 100, రూ. 200 , రూ. 600 ఇచ్చే వాళ్లు.
కానీ తాము అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిందన్నారు. పెన్షన్ రూ. 5 వేలు , పేదలకు సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR). ఈసారి రైతు బంధుకు సంబంధించి రూ. 16 వేలు పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో పవర్ లోకి వస్తే అగ్ర వర్ణాలలో ఉన్న పేదలకు గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం.
ఎన్నికల తర్వాత విడత వారీగా పెన్షన్ ను పెంచుతామని పేర్కొన్నారు . 93 లక్షల రేషన్ కార్డులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అచ్చంపేట వేదికగా జరిగిన సభలో ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటం..మీకే నష్టం జరుగుతుందన్నారు.
Also Read : PAK vs SA ICC World Cup : పాక్ గెలిస్తే సరి లేకపోతే ఇంటికే