CM KCR MLC Kavitha : బిడ్డ అరెస్ట్ పై సీఎం కామెంట్స్

ముందే ఫిక్స్ అయ్యారా కేసీఆర్

CM KCR MLC Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ముందు నుంచీ త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఇదే క్ర‌మంలో త‌న‌పై ఎవ‌రూ కూడా కామెంట్స్ చేయ‌కుండా ఉండేందుకు కోర్టు నుంచి ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత సీబీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్టింది. 10 విలువైన ఫోన్ల‌ను ధ్వంసం చేసింద‌ని ఆరోపించింది. సీబీఐ కోర్టుకు ఇచ్చిన రెండో రిపోర్టులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు క‌ల్వ‌కుంట్ల క‌విత కు కూడా పాత్ర ఉందంటూ ఆరోపించింది.

ఈ త‌రుణంలో మ‌నీ ట్రాన్సాక్ష‌న్ కు సంబంధించి రంగంలోకి దింపింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ. మొద‌ట సీబీఐ ఇంటి త‌లుపు త‌ట్టింది. క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను విచారించింది. అనంత‌రం ఈడీ విచార‌ణ‌కు రావాల్సిందంటూ నోటీసులు జారీ చేసింది.

మార్చి 9న హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది క‌ల్వ‌కుంట్ల క‌విత‌. త‌న‌కు ప్రోగ్రామ్స్ ఉన్నాయ‌ని, తాను రాలేన‌ని మార్చి 15న హాజ‌ర‌వుతాన‌ని పేర్కొంది. దీనిపై ఈడీ సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యింది. కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.

కావాలంటే ఒక రోజు టైం ఇస్తామ‌ని వెల్ల‌డించింది. మార్చి 11న హాజ‌రు కావాల్సిందేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో కొడుకు, మంత్రి కేటీఆర్ హుటా హుటిన ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించారు. కానీ ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ఇక ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ స‌మావేశంలో సీఎం కేసీఆర్(CM KCR MLC Kavitha)  కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న బిడ్డ‌ను ఈడీ ట‌చ్ చేసింద‌ని..అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..?

Leave A Reply

Your Email Id will not be published!