CM KCR MIM : ఎంఐఎంతో బీఆర్ఎస్ దోస్తానా – సీఎం
ఎన్నికల్లో కలిసే ఉంటామని ప్రకటన
CM KCR MIM : బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రగతి భవన్ వేదికగా ఆయన రాబోయే ఎన్నికలకు సంబంధించి 119 సీట్ల జాబితాను వెల్లడించారు. ఇందులో 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ తరపు నుంచి ఖరారు చేశారు. వీరిలో ఏడు స్థానాలలో సిట్టింగ్ లను మార్చేశారు. వారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు కేసీఆర్.
CM KCR MIM Together
లిస్టు ప్రకటించిన అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసే ప్రచారం చేస్తామన్నారు. ముందు నుంచి తాము మిత్రులుగానే ఉన్నామని అదే ఈసారి ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR) .
తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. అన్ని సీట్లలో తాము అత్యధిక మెజారిటీలో గెలుపొందడం ఖాయమన్నారు. ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే 115 మందికి ఖరారు చేశామన్నారు. అయితే కొందరికి కొన్ని కారణాల వల్ల సీట్లు ఇవ్వలేదన్నారు. వారికి మిగతా చోట్ల ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇంకా నాలుగు సీట్లకు ఖరారు చేయలేదన్నారు.
ఇక ఎన్నికల శంఖారావం పూరించినట్లేనని స్పష్టం చేశారు. అక్టోబర్ 16న బీఆర్ఎస్ గర్జన సభ ఉంటుందన్నారు కేసీఆర్. మొత్తంగా బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ ఉందని బహిరంగంగా ప్రకటించారు.
Also Read : CM KCR Assurance : సీట్లు రాని వాళ్లకు మంచి భవిష్యత్తు