CM KCR : మోదీ పీఎం కాదు ఓ సేల్స్ మెన్
నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
CM KCR : సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై. దేశానికి ఓ విజన్ లేని పీఎం ఉండడం దారుణమన్నారు.
తన ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రగల్భాలు పలుకుతున్నారని దమ్ముంటే టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు కేసీఆర్(CM KCR). మోదీ పాలనలో దేశం పురోగమనం అన్నది లేకుండా పోయిందని మొత్తం తిరోగమనమే ఉందని ఎద్దేవా చేశారు.
కేంద్ర సర్కార్ పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు. ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రిగా కాకుండా ఓ సేల్స్ మెన్ గా పని చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
మోదీ తీరుపై శ్రీలంక లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేశారని చెప్పారు. ఆయన కేవలం కొంత మంది వ్యాపారవేత్తల కోసమే పని చేస్తున్నారని దేశానికి కాదన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన ఘనత మోదీదేనని అన్నారు. ఇక ఇప్పటి వరకు 14 మంది ప్రధానమంత్రులు పని చేస్తే తమదైన రీతిలో పాలన సాగించారని కానీ మోదీ వచ్చాక పూర్తిగా ప్రచారం, ఆర్భాటమే తప్ప దేశానికి మేలు చేకూర్చింది ఒక్కటి కూడా లేదన్నారు.
ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం దేశానికి పట్టిన దుర్గతిగా ఆయన అభివర్ణించారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు విచ్చేశారు.
ఈ సందర్భంగా సీఎం స్వాగతం పలికారు. అనంతరం జల విహార్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్(CM KCR) ప్రసంగించారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
Also Read : భారత రాజకీయాల్లో సిన్హా అరుదైన నేత