CM KCR : ఆగని వర్షం అంతటా అప్రమత్తం
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన సర్కార్
CM KCR : నైరుతి రుతుపవనాల దెబ్బకు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 10 జిల్లాలకు పైగా వర్షాల దెబ్బకు వణుకుతున్నాయి.
ముందే గ్రహించిన సీఎం కేసీఆర్(CM KCR) విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇంకా 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రాజెక్టులన్నీ జలకళతో నిండు కుండగా మారాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండింది.
ఎల్లంపల్లి , ప్రాణహితతో పాటు గోదావరికి నీళ్లు పెద్ద ఎత్తున చేరాయి. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది గోదారమ్మ. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడి వారక్కడ ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం ఆదేశించచారు.
కేసీఆర్ సూచనల మేరకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారని, అవసరమైతే అక్కడే ఉంటూ వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు సీఎం(CM KCR).
నిన్న సమీక్ష చేపట్టిన సీఎం ఇవాళ సైతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక చర్యలు ఎలా ఉన్నాయంటూ అడిగారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు కేసీఆర్. ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలు, హెలికాప్టర్లను సిద్దం చేశారు. అంతా సమన్వయం చేసుకుని పర్యవేక్షించాలని సూచించారు సీఎం.
వరద బాధితుల సహాయ చర్యల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం 7997959705, 7997950008 నంబర్లు ఏర్పాటు చేసింది. లోతట్టు వంతెనల వద్ద పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు.
Also Read : కురుస్తున్న వర్షాలు తప్పని కష్టాలు