KCR : ప్ర‌గ‌తి ప‌థం తెలంగాణ అభివృద్ది మంత్రం

స్ప‌ష్టం చేసిన సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు

KCR : త‌ర త‌రాలుగా తెలంగాణ విధ్వంసానికి లోనైంది. ఎన‌లేని ఇబ్బందులు ప‌డ్డ‌ది. గాయ‌ప‌డ్డ తెలంగాణ‌కు చికిత్స చేసి ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నించేలా కృషి చేస్తున్నామ‌న్నారు సీఎం కేసీఆర్. ప్ర‌గ‌తి ప‌థం తెలంగాణ అభివృద్ధి మంత్రమ‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఈ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌లు అవుతున్నాయ‌ని తెలిపారు. తెలంగాణ దేశానికి త‌ల‌మానికంగా నిలిచింద‌న్నారు. ధ్వంస‌మైన తెలంగాణ‌ను పున‌ర్ నిర్మిస్తున్నామ‌ని చెప్పారు.

తాను ప‌ద‌వికి రాజీనామా చేసిన స‌మ‌యంలో అంద‌రూ వెక్కిరించిన వాళ్లే. కానీ వాళ్ల నోళ్ల‌ను మూయించిన‌. ఒక్క‌డినే బ‌య‌లు దేరిన. స‌మ‌స్త తెలంగాణ ప్ర‌జానీకం నా వెంట న‌డించింది.

సంబండ వ‌ర్ణాలు, కులాలకు అతీతంగా ప్ర‌తి ఒక్కరు నేను ఇచ్చిన జై తెలంగాణ పిలుపున‌కు ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌చ్చారు. నాకు అండ‌గా నిలిచారు.

ఇక రానే రాద‌ని, అసాధ్య‌మ‌ని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చేంత దాకా కాలు పెట్ట‌న‌ని ఆనాడు చెప్పిన‌. ఆచ‌రించి చూపించిన‌.

ఇవాల తెలంగాణ బంగారు మ‌యంగా మారింద‌న్నారు. టీహ‌బ్, వి హ‌బ్, అగ్రి హ‌బ్, ఇలా ప్ర‌తి రంగంలో తెలంగాణ దూసుకు పోతోంద‌న్నారు కేసీఆర్(KCR). పాల‌నే చేత కాద‌ని ఎద్దేవా చేశారు.

కానీ ఇప్పుడు మ‌న సుప‌రిపాల‌న‌ను చూసి మిగ‌తా రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయ‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింద‌న్నారు.

ఇవాళ సీఎం కేసీఆర్(KCR) స‌మీక్ష చేప‌ట్టారు. రెండు ప‌ర్యాయాలుగా కేంద్ర స‌ర్కార్ ప్ర‌క‌టించిన ఉత్త‌మ గ్రామాల్లో మొద‌టి ద‌శ‌లో ప‌దికి ప‌ది గ్రామాలు , రెండో ద‌శ‌లో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక‌య్యాయ‌ని ఇది అంద‌రి స‌మిష్టి కృషికి ద‌క్కిన ఫ‌లిత‌మ‌న్నారు కేసీఆర్.

Also Read : తెలంగాణ సీజేగా ఉజ్జ‌ల్ భూయాన్

Leave A Reply

Your Email Id will not be published!