KCR CM : తెలంగాణ త‌ల్లీ నీకు వంద‌నం  

నాలుగున్న‌ర కోట్ల నా తెలంగాణ 

KCR : హైద‌రాబాద్ గులాబీమ‌యం అయ్యింది. తెలంగాణ  రాష్ట్ర స‌మితి ఏర్పాటై 21 ఏళ్లు పూర్త‌యింది. ఇవాళ్టితో 22వ ఏట అడుగు పెడుతోంది. ఈ సంద‌ర్భంగా న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఆవిర్భావ వేడుక‌లు చేప‌ట్టారు.

ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, చీఫ్ , తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్(KCR) తెలంగాణ త‌ల్లికి పూల‌మాల‌లు వేసి వంద‌నం చేశారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఉద్వేగ పూరిత‌మైన ప్ర‌సంగం చేశారు. రెండు ద‌శాబ్దాల కింద‌ట తెలంగాణ నెర్ర‌లు బారింది. క‌ర‌వు నెల‌కొంది.

ఎటు చూసినా ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, క‌రెంట్ కోత‌లు, వ‌ల‌స‌లు. కుట్ర‌లు, కుతంత్రాలు, కేసులు, అరెస్ట్ లు వీట‌న్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డింది తెలంగాణ.

అలుపెరుగ‌ని రీతిలో పోరాటం చేసింది. రాష్ట్రం రాద‌న్నారు. గేలి చేశారు. భాష పేరుతో, యాస పేరుతో వెక్క‌రించారు. కానీ అన్నింటిని దాటుకుని, అడ్డంకులు ఛేదించుకుని ముందుకే న‌డిచాం.

అనుకున్న‌ది సాధించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పాల‌న చేత కాద‌న్నారు. పాలించ‌డం రాద‌న్నారు. కానీ ప్ర‌పంచం నివ్వెర పోయేలా దేశం గ‌ర్వించేలా తెలంగాణ‌ను అన్నింటా ముందంజ‌లో నిలిపామ‌ని చెప్పారు సీఎం కేసీఆర్(KCR).

దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా, ఆద‌ర్శంగా నిలిచేలా చేశామ‌న్నారు. ప్ర‌జ‌ల స‌హ‌కారం మ‌రిచి పోలేమ‌న్నారు. ఐటీ హ‌బ్ , ఫార్మా హబ్, ఆవిష్క‌ర‌ణ‌ల హ‌బ్ , అగ్రిక‌ల్చ‌ర్ హ‌బ్ గా తెలంగాణ కేరాఫ్ గా మారింద‌న్నారు సీఎం.

తెలంగాణ జ‌ల‌భాండాగారంగా, ధాన్యాగారంగా మారింద‌న్నారు కేసీఆర్.

Also Read : కాకాణి – అనీల్‌ల మాట‌ల యుద్దం ఆగేనా?

Leave A Reply

Your Email Id will not be published!