CM KCR : 15న బీఆర్ఎస్ కీలక సమావేశం
హాజరు కావాలని ఆదేశించిన సీఎం
CM KCR : హైదరాబాద్ – త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా సరే ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలని శపతం చేశారు. ఈ మేరకు పార్టీ పరంగా దిశా నిర్దేశం చేశారు.
CM KCR Latest Updates
ఇందులో భాగంగా ప్రగతి భవన్ లో ఈనెల 15న బీఆర్ఎస్ పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 18 నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా పార్టీకి చెందిన ఎంపీలు అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలు, సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు విధిగా హాజరు కావాలని బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ కోరారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందే సీఎం 119 సీట్లకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. అంతా సిట్టింగ్ లే ఉండడం విశేషం. 7 మందికి మొండి చేయి చూపించారు.
Also Read : AP CM YS Jagan : జగన్ రెడ్డికి గ్రాండ్ వెల్ కమ్