CM KCR : ప్రభుత్వం సంసారం ఒక్కటే
తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్
CM KCR : ప్రభుత్వం నడపడం అంటే మామూలు మాటలు కాదు అది సంసారం నడిపినట్టేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి 115 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో ఎన్నికల సమరాన్ని మోగించినట్లేనని స్పష్టం చేశారు.
CM KCR in Medak Meeting
ఏమీ చేయలేని వాళ్లు మాయ మాటలతో బురిడీ కొట్టించాలని చూస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కేసీఆర్(KCR). ఈసారి కూడా బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని సీఎం కోరారు. పద్మా దేవేందర్ రెడ్డికి భారీ మెజారిటీ ఇవ్వాలన్నారు. మెదక్ ను ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని చెప్పారు కేసీఆర్.
మెదక్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. వీఆర్ఎస్ వ్యవస్థను తీసి వేయాలంటూ మరాఠాలో కూడా కోరుతున్నారని చెప్పారు. అక్కడి రైతులు తనకు బ్రహ్మరథం పడుతున్నారని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ 3 గంటలు కరెంట్ చాలంటోంది. ఇక బీజేపీ ఏకంగా విద్యుత్ మోటార్లు బిగిస్తానంటోంది. మరి వాళ్లకు ఓటు వేస్తారా ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ ను ఎన్నుకుంటారా మీరే తేల్చు కోవాలని అన్నారు. ముచ్చటగా మూడోసారి పవర్ లోకి వస్తామని జోష్యం చెప్పారు.
Also Read : Patnam Mahender Reddy : ‘పట్నం’కు లైన్ క్లియర్