KCR : శుభ‌ప్ర‌దం రాష్ట్రం అభివృద్ధి ప‌థం

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

KCR  : ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. శుభకృత్ నామ సంవ‌త్స‌రం అన్ని రంగాల‌లో రాష్ట్రం అభివృద్ది చెంద‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టికే దేశానికి తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు.

ప్ర‌భుత్వం చేస్తున్న కృషి కార‌ణంగా కీల‌క రంగాల‌లో అభివృద్ధి జ‌ర‌గ‌డం సంతోసంగా ఉంద‌న్నారు సీఎం(KCR ). రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉగాది నుంచ‌చే నూత‌న ఏడాది ప్రారంభం అవుతుంద‌న్నారు.

సాగు నీరు, వ్య‌వ‌సాయ రంగాల‌కు అత్య‌ధికంగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నామ‌ని చెప్పారు కేసీఆర్. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో అన్న‌దాత‌ల సంక్షేమానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు.

రాష్ట్రం సాధించిన కొన్ని ఏళ్ల‌కే ఊహించ‌ని రీతిలో పురోగ‌తి సాధించింద‌న్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్ట‌మైంద‌న్నారు. వ్య‌వ‌సాయం బాగుంటేనే స‌ర్వ‌జ‌నులు సంతోషంగా ఉంటార‌న్నారు.

క‌రోనా క‌ష్ట కాలంలోనూ రాష్ట్రం మున్ముందుకే సాగింద‌న్నారు. ఉత్ప‌త్తి సేవా రంగాలలో సైతం రాష్ట్రం ముందంజ‌లో సాగుతోంద‌న్నారు సీఎం. యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని తెలిపారు.

ఇప్ప‌టికే 90 వేల 39 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే అసెంబ్లీ లో డిక్లేర్ చేశామ‌న్నారు. 30 వేల 439 పోస్టుల‌కు ఆర్థిక శాఖ ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌న్నారు సీఎం.

శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రాదిని పుర‌స్క‌రించుకొని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో పంచాంగ శ్ర‌వ‌ణ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ (KCR )తో పాటు చైర్మ‌న్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

వీరితో పాటు వేద పండితులు, అర్చ‌కుల్ని స‌న్మానించారు సీఎం. ఈ సంద‌ర్బంగా పంచాంగ శ్ర‌వ‌ణం ప‌ఠించారు. ఈసారి సీఎంకు బాగుంటుంద‌ని తెలిపారు.

Also Read : తెలంగాణ‌పై రాహుల్ గాంధీ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!