CM KCR : నారాయణఖేడ్ – తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ది నమూనా దేశానికి చిరునామాగా మారిందని అన్నారు సీఎం కేసీఆర్(CM KCR). రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.
CM KCR Praises his Ruling
గతంలో ఎటు చూసినా కరువు ఉండేది. నీళ్లకు, నిధులకు, కరెంట్ కు ఇబ్బంది ఏర్పడేదన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, కావాల్సినంత నిధులు ఉన్నాయని అన్నారు కేసీఆర్.
కోరి కొనితెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడా లేవన్నారు. ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా విద్యా, వైద్య, ఐటీ, లాజిస్టిక్ రంగాలు పరుగులు తీస్తున్నాయని చెప్పారు సీఎం. ఒకప్పుడు ఉద్యోగులు నారాయణఖేడ్ కు రావాలంటే జంకే వారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించడం వల్ల ఇదంతా సాధ్యమైందన్నారు. భూపాల్ రెడ్డిని మళ్లీ గెలిపించండి.. నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం ఆగం కావొద్దని సూచించారు.
Also Read : Buggana Rajendranath Reddy : ఏపీ సర్కార్ పనితీరు సూపర్
