CM KCR : వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్రం
దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి
CM KCR : ఆనాటి వీరుల త్యాగఫలాలే నేటి స్వాతంత్రం అన్నారు సీఎం కేసీఆర్. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం.
ఈ సందర్భంగా గోల్కొండ కోట వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంధ్రాగష్టు వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఎగుర వేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం(CM KCR) ప్రసంగించారు. వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా జాతీయ జెండాలను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.
నాటి స్వాతంత్ర పోరాటంలో తెలంగాణకు చెందిన తుర్రేబాజ్ ఖాన్ , రాంజీ గోండు, పీవీ సహా అనేక మంది పాల్గొన్నారని అన్నారు. ఎలాంటి హింస లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు కేసీఆర్.
సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల కోసమే తాము అప్పులు చేశామన్నారు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు సీఎం. ఆనాడు హైదరాబాద్ ను గంగా జమునా తెహజిబ్ గా మహాత్మా గాంధీ అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం.
ప్రస్తుతం రాష్ట్రం త్రివర్ణ శోభితంగా మారిందన్నారు. కోటి 20 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశామన్నారు కేసీఆర్. ప్రతి భారతీయుడు ఉప్పొంగి పోయే అద్భుతమైన సన్నివేశం ఇదన్నారు.
మహనీయుల త్యాగాలను స్మరించు కోవడం మనందరి బాధ్యత అన్నారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రను, ఆదర్శాలను, విలువలను నేటి తరానికి తెలియ చేసేందుకు సర్కార్ నడుం బిగించిందన్నారు.
15 రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు కేసీఆర్.
Also Read : జాతీయ జెండా ఆత్మ గౌరవానికి ప్రతీక