KCR : ఒక సమున్నత లక్ష్యంతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం పార్టీగా అవతరించింది. అనుకున్నది సాధించింది. బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నది. ఈ దేశానికే తెలంగాణ ఓ రోల్ మోడల్ గా నిలిచింది.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నది. ఎక్కడా లేనంత సభ్యులు కలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ మిగతా పార్టీల లాంటిది కానే కాదు.
అది నాలుగున్నర కోట్ల ప్రజల శ్వాస, ఆశ, ఆశయం పార్టీ ఆస్తి అని పేర్కొన్నారు కేసీఆర్(KCR). టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఇప్పుడు 22వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. 60 లక్షల మంది సభ్యులు కలిగిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రాన్ని పరుల చేతుల్లోకి పెట్టేందుకు కాదన్నారు. తెలంగాణకు కాపలాదారుగా ఉండేందుకే తాను పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు కేసీఆర్.
తెలంగాణపై పేటెంట్ ఒక్క టీఆర్ఎస్ కు మాత్రమే ఉందని మిగతా పార్టీలకు లేదన్నారు. ఆనాడు దిక్కు తోచని స్థితిలో ఉన్న తెలంగాణకు దిశా నిర్దేశం చేసి అభివృద్ధి పథాన సాగేలా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు కేసీఆర్(KCR).
జనమే జెండా సమస్యలే ఎజెండాగా మొదటి నుంచీ ఉద్యమించిన చరిత్ర టీఆర్ఎస్ కు ఉందన్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులు, కేసులు , అరెస్ట్ లు దాటుకుని ముందుకు సాగామన్నారు సీఎం.
ప్రజలందరి దీవెనలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్నామని చెప్పారు కేసీఆర్.
Also Read : దేశానికే తెలంగాణ తలమాణికం – కేసీఆర్