CM KCR : ఎర్రకోటపై ఎగిరే జెండా మనదే – కేసీఆర్
2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం
CM KCR : భారత రాష్ట్ర సమితి చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) సంచలన కామెంట్స్ చేశారు. 2024లో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలలో గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమన్నారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
యావత్ భారతమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శ ప్రాయంగా మారాయని చెప్పారు. ఇవాళ కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం తమ పథకాలు, కార్యక్రమాలను కాపీ చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, తదితర రంగాలలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆనాడు రాష్ట్రం రాదన్నారని కానీ అకుంఠిత దీక్షతో అందరినీ ఒప్పించి తెలంగాణను తీసుకు వచ్చానని చెప్పారు కేసీఆర్(CM KCR).
మరాఠాలో, కర్ణాటకలో, యూపీలో ఇలా దేశ వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విస్తరిస్తోందని, త్వరలోనే అన్ని ప్రాంతాలలో ఫోకస్ పెడతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో డిసైడ్ ఫ్యాక్టర్ గా మారేలా తాను ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు కేసీఆర్(CM KCR). ప్రజల కోసం పని చేస్తే వచ్చే తృప్తి ఇంకెందులోనూ కలగదన్నారు. ఆనాడు తనను గేలి చేసిన వారే ఇవాళ తనను ప్రశంసిస్తున్నారని చెప్పారు సీఎం. ఇక నుంచి ప్రతి చోటుకు విస్తరిస్తాం..దేశంలో అధికారం దిశగా ముందుకు కదులుతామని అన్నారు.
Also Read : కర్ణాటక ఎన్నికల బరిలో ఎన్సీపీ