KCR Kashmir Files : వివేక్ అగ్ని దర్శకత్వం వహించిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రూ. 100 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ సినిమాను మెచ్చుకున్నారు.
బీజేపీ శ్రేణులు, నాయకులు, మంత్రులు, సీఎంలు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు.
ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తే శివేసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ దీనిని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ తరుణంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఇది చిత్రమే కాదన్నాడు. తాజాగా సీఎం కేసీఆర్ ది కశ్మీర్ ఫైల్స్(KCR Kashmir Files )పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదని డెవలప్ మెంట్ ఫైల్స్ కావాలన్నారు.
దేశంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ చిత్రాన్ని విడుదల చేశారని, దానిని రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం కశ్మీర్ ఫైల్స్ మూవీని (KCR Kashmir Files )వదిలేసి ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు కేసీఆర్.
కశ్మీర్ లో హిందూ పండిట్లను చంపిన సమయంలో బీజేపీ ప్రభుత్వం లేదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పక్కదోవ పట్టించేందుకే కావాలని దీనిని ముందుకు తీసుకు వచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : వేగేశ్న సతీష్ ‘కథలు’ వెబ్ సిరీస్ !