CM KCR : రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్

నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

CM KCR : కొడంగల్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం కొడంగ‌ల్ లో జ‌రిగిన బీఆర్ఎస్ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు కేసీఆర్. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల‌ర్ అంటూ మండిప‌డ్డారు. అతి పెద్ద భూ క‌బ్జాదారుడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ధ‌ర‌ణిని తీసివేసి భూమాత పెడ‌తామంటున్నార‌ని , భూమాత‌నా లేక భూమేత‌నా అని ఎద్దేవా చేశారు సీఎం.

CM KCR Slams Revanth Reddy

ఈసారి తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని , తాము వ‌చ్చిన వెంట‌నే పెన్ష‌న్ల‌ను రూ. 5 వేల‌కు పెంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు బంధును తీసుకు వ‌చ్చింది తామేన‌ని చెప్పారు కేసీఆర్. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రైతు బంధు వృధా అంటున్నాడ‌ని , సోయి లేనోళ్ల‌కు తాము తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాలు అర్థం కావ‌న్నారు.

రైతుల‌కు తాము 24 గంట‌ల పాటు క‌రెంట్ ఇస్తున్నామ‌ని కానీ రేవంత్ రెడ్డి కేవ‌లం 3 గంట‌లు చాలు అంటున్నాడ‌ని ఇదేమి రాజ‌కీయ‌మ‌ని ప్ర‌శ్నించారు కేసీఆర్(CM KCR). ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఆ పార్టీకి క‌నీసం 10 సీట్లు కూడా రావ‌న్నారు. రాబోయేది గులాబీ పార్టీనేన‌ని ముచ్చ‌ట‌గా మూడోసారి తాను సీఎంగా ప్ర‌మాణం చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కేసీఆర్.

Also Read : JD Lakshminarayana : బ‌ర్రెల‌క్క‌కు భ‌ద్ర‌త క‌ల్పించండి

Leave A Reply

Your Email Id will not be published!