CM KCR : వికారాబాద్ క‌లెక్ట‌రేట్ ను ప్రారంభిచిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ ఆఫీసు కూడా

CM KCR :  పాల‌నా ప‌రంగా సౌల‌భ్యం కోసం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌క‌చ‌కా నూత‌న క‌లెక్ట‌రేట్ల భ‌వ‌నాలు పూర్తి కావ‌డం జ‌రుగుతోంది.

తాజాగా వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌రేట్ ను మంగ‌ళ‌వారం ప్రారంభించారు కేసీఆర్(CM KCR). దీంతో పాటు నూత‌న‌గా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి కూడా ప్రారంభానికి నోచుకుంది.

అన్ని శాఖ‌లు ఒకే చోటుకు రావాల‌న్న‌ది సీఎం క‌ల‌. దానిని సాకారం చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించారు.

కోట్లాది రూపాయ‌లు వీటి కోసం ఖ‌ర్చు చేశారు. ఇదిలా ఉండ‌గా కొన్ని చోట్ల విలువైన స్థ‌లాలు ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌నో కొంత దూరంలో ఏర్పాటు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

కానీ వాటన్నింటిని బేఖాత‌ర్ చేస్తూ ముందుకే వెళ్లారు పార్టీ చీఫ్‌. ప్ర‌స్తుతం రైతు కేంద్రాలు, పార్టీ ఆఫీసులు, క‌లెక్ట‌రేట్లు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సాధించిన వాటిలో ఒక‌టి.

పంధ్రాగ‌స్టు ముగిసినా ఈరోజు వ‌ర‌కు కొన్ని శాఖ‌ల‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు వేత‌నాలు రాలేదు. ఏది ఏమైనా కొత్త‌గా ఏర్పాటు చేసిన క‌లెక్ట‌రేట్ ఇవాళ ప్రారంభించ‌డంతో కొత్త క‌ళ సంత‌రించుకుంది వికారాబాద్ న‌గ‌రంలో.

ఇక పార్టీ ఆఫీసులో జెండాను ఎగుర వేశారు. అనంత‌రం ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ భ‌వ‌న నిర్మాణానికి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం ఎప్పుడో పూర్త‌యింది. కానీ ముహూర్తం బాగుండ‌డంతో నేటితో ముగిసింది. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నారు.

Also Read : ఓవైసీపై రాం దేవ్ బాబా కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!