CM KCR Tour : సీఎం కేసీఆర్ జంగు సైరన్
15 నుంచి ప్రచారం షురూ
CM KCR Tour : తెలంగాణ – భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెలలో జరిగే శాసన సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈనెల 15న ముహూర్తం ఖరారు చేశారు. అంతకంటే ముందే నవంబర్ 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి గెజిట్ రానుంది. నవంబర్ 13 దాకా దరఖాస్తులు అభ్యర్థుల నుంచి స్వీకరిస్తారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారు ఉప సహరించు కునేందుకు డెడ్ లైన్ నవంబర్ 15గా నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం.
CM KCR Tour Viral
ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల సీఎం కేసీఆర్(CM KCR) ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇందుకు గాను నవంబర్ 9న ముహూర్తం ఖరారు చేశారు. 15న పార్టీకి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారమ్ లు అందజేస్తారు స్వయంగా కేసీఆర్.
9న ఉదయం ఎప్పటి లాగే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి గజ్వేల్ కు వెళతారు. ఆ తర్వాత కామారెడ్డిలో మధ్యాహ్నం దరఖాస్తు చేస్తారు. 15 నుంచి రాష్ట్రమంతటా ఎంపిక చేసిన 42 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తారు సీఎం కేసీఆర్. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ.
Also Read : NewsClick Case : న్యూస్ క్లిక్ పై కేసు నమోదు