CM KCR Tour : కేసీఆర్ మెదక్ జిల్లా టూర్ వాయిదా
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
CM KCR Tour : సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా టూర్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పరిస్థితుల దృష్ట్యా సీఎం(CM KCR) మెదక్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 19న జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా టూర్ ను 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
CM KCR Tour Postponed
త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కీలకమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పార్టీ పరంగా దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు.
ఇదిలా ఉండగా సీఎం జిల్లా పర్యటన సందర్బంగా అధికారులు , నేతలు ఏర్పాట్లు చేశారు. కానీ ఉన్నట్టుండి వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కీలకమైన నిర్ణయాలు ఆ లోపు తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తంగా సీఎం కేసీఆర్ పర్యటనపై అటు ఉన్నతాధికారులు ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read : TTD Hand Sticks : శ్రీవారి భక్తులకు చేతికర్రలు సిద్దం