CM KCR Viral : నెట్టింట్లో సీఎం కేసీఆర్ వైరల్
గురుద్వారా ఫోటో సూపర్
CM KCR Viral : భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ ఏది చేసినా అది సంచలనం. ఆయన ఏది మాట్లాడినా కలకలమే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఆయనది. ఎవరూ ఊహించని రీతిలో షాక్ ఇవ్వడం కేసీఆర్ ప్రత్యేకత. పలు భాషల్లో పట్టుది. అంతే కాదు ఏ విషయాన్ని అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పడంలో మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరు పొందారు.
ఏది చెపుతారో దానిని ఆచరించరు అన్న అపప్రదను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు సైతం విస్తు పోయేలా ప్రసంగించడంలో కేసీఆర్ కు సాటి రారు ఎవరూ. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కడే నడిచాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేశారు. ఉద్యమాన్నే రాజకీయ పార్టీగా మార్చేశారు. అవును ఇది ఫక్తు పొలిటికల్ పార్టీనేనని ప్రకటించారు సీఎం కేసీఆర్(CM KCR Viral). కొత్త రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన ఆయన పక్కన పెట్టారు. తానే రైట్ పర్సన్ అంటూ ప్రకటించాడు.
తాజాగా మరో కీలక ప్రకటన చేశాడు కేసీఆర్. ఆయన ప్రధానమంత్రి మోదీపై , బీజేపీపై యుద్దం ప్రకటించాడు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేశాడు. రాష్ట్రానికి వెలుపల మొదటిసారిగా మరాఠా లోని నాందేడ్ లో బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు గురుద్వారాను దర్శించారు. ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసీఆర్ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : కేసీఆర్ మాయల మరాఠి – ఆకునూరి