CM KCR Visit : మ‌హంకాళి గుడిలో కేసీఆర్ పూజ‌లు

బోనాల పండుగ సంద‌ర్బంగా హాజ‌రు

CM KCR Visit : సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి దేవాల‌యంలో ఆదివారం అమ్మ వారికి సీఎం కేసీఆర్ దంప‌తులు బోనాల పండుగ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కేసీఆర్ తో పాటు భార్య శోభ‌మ్మ కు పూజారులు స్వాగ‌తం ప‌లికారు. భారీ ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించారు. వేద మంత్రాల‌తో అర్చ‌కులు ఆశీర్వ‌దించారు సీఎం దంప‌తుల‌ను. ఈ సంద‌ర్బంగా సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ప‌ట్టు వ‌స్త్రాల‌ను సీఎం కేసీఆర్(KCR) స్వ‌యంగా తీసుకు వెళ్లి అమ్మ వారికి స‌మ‌ర్పించారు.

సీఎం దంప‌తుల వెంట మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, శ్రీ‌నివాస్ గౌడ్ , శ్రీ‌నివాస్ గౌడ్ , మ‌ల్లా రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీలు కేశ‌వ రావు, సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఉన్నారు.

అంత‌కు ముందు జాత‌ర ఉత్స‌వంలో భాగంగా అమ్మ వారికి తొలి బోనం స‌మ‌ర్పించారు రాష్ట్ర ప‌శు సంవ‌ర్ద‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, ఇదిలా ఉండ‌గా బోనంతో వ‌చ్చే భ‌క్తుల‌కు అమ్మ వారి 20 నిమిషాల్లో ద‌ర్శ‌నం క‌లిగేలా శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌య పాల‌క మండ‌లి ఏర్పాట్లు చేసింది. భారీగా వ‌చ్చే భ‌క్తుల‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాలు జాత‌ర సంద‌ర్భంగా ల‌క్ష‌లాది మంది బోనాలు స‌మ‌ర్పిస్తారు.

Also Read : CM KCR : సాయి చంద్ కు కేసీఆర్ నివాళి

Leave A Reply

Your Email Id will not be published!