CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ

ప‌లువురు ప్ర‌ముఖుల‌తో చ‌ర్చ‌లు

CM KCR : సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే భార‌త రాష్ట్ర స‌మితిని ఏర్పాటు చేశారు. జాతీయ జెండాను కూడా ఆవిష్క‌రించారు. భావ సారూప్య‌త క‌లిగిన వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఢిల్లీ లో నాలుగు రోజుల పాటు అక్క‌డే ఉన్నారు. ఎస్పీ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆఫీసును పార్టీ చీఫ్‌, సీఎం కేసీఆర్(CM KCR) ఇవాళ సంద‌ర్శించారు.

అక్కడ ఎంపీలు, రైతు సంఘాల నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. రెండో అంత‌స్తులో ఏర్పాటు చేసిన ఛాంబ‌ర్ల‌ను కూడా ప‌రిశీలించారు. రాబోయే ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని చూస్తున్నారు. ఈ మేర‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎంపీ సంతోష్ రావు అన్నీ తానై చూసుకుంటున్నారు.

మ‌రో వైపు కూతురు ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో విచార‌ణ ఎదుర్కొంటున్నారు. త‌న‌యుడు మంత్రి కేటీఆర్ ప్ర‌స్తుతం రాష్ట్రంలో పాల‌న‌ను గాడిలో పెట్టే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు హైద‌రాబాద్ లో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నాయి.

ఇదంతా సీఎం కేసీఆర్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు కేటీఆర్. ఇక ఢిల్లీలో కుటుంబ స‌మేతంగా వెళ్లిన కేసీఆర్ వెంట ఎంపీ కేశ‌వ‌రావు, నామా నాగేశ్వ‌ర్ రావు కూడా ఉన్నారు. వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, ఎంపీలు, రైతు సంఘాల ప్ర‌తినిధులు ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసుకు క్యూ క‌ట్టారు.

దీంతో ఫుల్ జోష్ లో ఉన్నారు సీఎం కేసీఆర్. ఇక నుంచి టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ గా మారింది. దీంతో జ‌నంలో టీఆర్ఎస్ గురించి ఎక్కువ‌గా తెలుసు. కానీ బీఆర్ఎస్ గురించి తెలియ‌దు. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు పోవాల్సిన బాధ్య‌త ఆయా ప్రజా ప్ర‌తినిధుల‌పై ఉంది.

Also Read : ప్ర‌ధానితో స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించా

Leave A Reply

Your Email Id will not be published!