CM KCR Warning : గీత దాటితే వేటు తప్పదు – కేసీఆర్
అభ్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చీఫ్
CM KCR Warning : ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే పార్టీ సుప్రీం. దాని గీత దాటాలని ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదన్నారు సీఎం కేసీఆర్(KCR). సోమవారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో 119 స్థానాలకు గాను 115 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. వీరిలో ఏడుగురు సిట్టింగ్ లకు స్థాన చలనం కలిగింది. ఇక నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచారు. మొత్తం సిట్టింగ్ లకే ప్రయారిటీ ఇచ్చారు సీఎం.
CM KCR Warning to Opposition
వాళ్లు ఎంత పెద్ద వాళ్లయినా సరే పీకి పారేస్తామన్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే వాళ్లకు పదవులు వస్తాయన్నారు. ఏదో పదవి ఉందని, డబ్బులు ఉన్నాయని నోరు పారేసుకుంటే చీరేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఆయన మైనంపల్లి హనుమంత రావు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అనేది ఒకటి ఉందని తెలుసు కోవాలన్నారు. మధ్యలో హరీశ్ రావును ఎందుకు లాగారంటూ మండిపడ్డారు.
చాలా చోట్ల సీట్లు ఆశించిన వారు తాను నిర్ణయం తీసుకున్నాక వారికి మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని అన్నారు. భూపాలపల్లిలో వెంకట రమణా రెడ్డికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి మద్దతు ఇస్తున్నారని, తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి కూడా రోహిత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఉన్నంతలో సర్దుకు పోవాలని లేక పోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.
Also Read : KTR : అభ్యర్థులకు కంగ్రాట్స్..రానోళ్లకు తప్పక ఛాన్స్