KCR : బోయ‌గోడ అగ్నిప్ర‌మాదంపై సీఎం దిగ్భ్రాంతి

రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన కేసీఆర్

KCR : ఇవాళ ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది తెలంగాణ‌లోని సికింద్రాబాద్ బోయ‌గూడ టింబ‌ర్ లో (Timber in Telangana). స్క్రాప్ గో డౌన్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది (Boyangoda fire). ఈ ఘ‌ట‌న‌లో 11 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. వీరంతా బీహార్ కార్మికులేన‌ని స‌మాచారం.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే (CM KCR)  సీఎం కేసీఆర్(KCR) స్పందించారు. ఈమేర‌కు బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికీ రూ. 5 లక్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.

బీహార్ వ‌ల‌స కార్మికుల మృత దేహాల‌ను వారి వారి స్వ‌స్థాల‌కు త‌ర‌లించేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ (KCR)ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ బోయ‌గూడ లో స్క్రాప్ గోడౌన్ లో తెల్ల‌వారుజామున ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. గోడౌన్ లో మంట‌లు చెల రేగాయి. గోడ క‌ప్పు పూర్తిగా కుప్ప కూలింది.

ఈ ఘ‌ట‌న‌లో 11 మంది అక్క‌డిక‌క్క‌డే స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎంతో పాటు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఘ‌ట‌న కు సంబంధించి స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నించాయి.

మంట‌లు అదుపులోకి వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేశాయి. కాగా ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణం షార్ట్ స‌ర్క్యూట్ అని భావిస్తున్నారు పోలీసులు. మృత దేహాల‌ను పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్ప్ర‌తికి త‌ర‌లించారు.

Also Read : సోయి త‌ప్పి మాట్లాడుతున్న సీఎం

Leave A Reply

Your Email Id will not be published!