MK Stalin Modi BBC Adani : మోదీ బీబీసీ..అదానీపై వివరణ ఏది
నిప్పులు చెరిగిన సీఎం ఎంకే స్టాలిన్
MK Stalin Modi BBC Adani : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి తాను చేసిన తప్పులను ఒప్పుకున్నారంటూ పేర్కొన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ప్రధాని ప్రసంగం పూర్తిగా వాక్చాతుర్యంతో కూడుకుని ఉన్నదని , అయితే బీబీసీ డాక్యుమెంటరీ , అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు సీఎం. తమిళనాడు గురించి కనీసం ప్రస్తావన కూడా తీసుకు రాలేదన్నారు. మరోసారి ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పార్లమెంట్ ప్రసంగంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు సంబంధించి ..ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గంటల తరబడి మాట్లాడే కళను తాను ప్రధాన నుంచి నేర్చుకున్నానని ఎద్దేవా చేశారు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin Modi BBC Adani).
ప్రధాన మంత్రిపై , బీజేపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ నరేంద్ర మోదీ దేనికీ స్పందించ లేదు. ప్రజల నమ్మకమే తన రక్షణ కవచమని చెప్పారు. కానీ ప్రజలు అలా భావించడం లేదని అన్నారు సీఎం. దానిని పీఎం గుర్తించడం లేదన్నారు.
అదానీ గ్రూప్ పై ఆరోపణలు , కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు ఉన్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ కేసును తీవ్రంగా విచారిస్తోందన్నారు. ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ తరుణంలో సమగ్రమైన చర్చ పార్లమెంట్ లో జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు ఎంకే స్టాలిన్(MK Stalin Modi BBC Adani).
Also Read : మొఘల్ చరిత్రను మార్చలేదు – షా