MK Stalin Oscar Winners : బొమ్మ‌న్..బెల్లీకు సీఎం స‌త్కారం

ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ మూవీకి ఆస్కార్

MK Stalin Oscar Winners : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ఆస్కార్ అవార్డు 2023 సంవ‌త్స‌రానికి స్వంతం చేసుకున్న భార‌త దేశానికి చెందిన ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ మూవీపై పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ , ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్ర‌స్తుత చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో పాటు ప్ర‌తి ఒక్క‌రు పేరు పేరునా అభినందించారు. తాజాగా ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ చిత్రంలో స‌హ‌జంగా న‌టించిన బొమ్మ‌న్ , బెల్లీ దంప‌తుల‌ను ఘ‌నంగా స‌న్మానం చేశారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin Oscar Winners).

ప్రతి ఒక్క‌రికి రూ. 1 ల‌క్ష చొప్పున అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. త‌మిళ‌నాడు ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పినందుకు ఆనందంగా ఉంద‌న్నారు ఎంకే స్టాలిన్.

అంతే కాకుండా రాష్ట్రంలోని రెండు ఏనుగుల శిబిరాల్లో ప‌ని చేస్తున్న 91 మంది కార్మికుల‌కు (కేర్ టేక‌ర్లు) రూ.1 ల‌క్ష చొప్పున ప్ర‌క‌టించారు. అంతే కాకుడా ఏనుగు శిబిరాల వ‌ద్ద ప‌ని చేసే వారంద‌రికీ ప‌ర్యావర‌ణానికి అనుకూల‌మైన గృహాల‌ను కూడా క‌ట్టిస్తామ‌ని వెల్ల‌డించారు సీఎం ఎంకే స్టాలిన్. కోయంబ‌త్తూరులో ఏనుగుల కోసం కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు.

రియ‌ల్ ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ డాక్యుమెంట‌రీ షార్ట్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మొద‌టి భార‌తీయ చిత్రం. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడు అట‌వీ శాఖ‌ను సీఎం అభినందించారు. 40 నిమిషాల నిడివి క‌లిగిన ఈ డాక్యుమెంట‌రీ చిత్రానికి కార్తికి గోన్సాల్వేస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా గునీత్ మోంగా నిర్మించారు.

త‌మిళ‌నాడు లోని నీల‌గిరి లోని సుంద‌ర‌మైన ముదుమ‌ల్లె అడ‌వుల్లో నివ‌సించే క‌ట్టు నాయ‌క‌న్ తెగ‌కు చెందిన వారే ఈ బొమ్మ‌న్ , బెల్లి దంప‌తులు. వారి సంర‌క్ష‌ణ‌లో ఉంచిన ర‌ఘు అనే అనాధ ఏనుగు పిల్ల క‌థ ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్.

Also Read : అద్భుతం ‘ఆమె’కు ద‌క్కిన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!