MK Stalin : అమిత్ షా కామెంట్స్ స్టాలిన్ సీరియస్
కర్ణాటకలో ముస్లిం కోటా రద్దుపై ఆగ్రహం
MK Stalin : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. కర్ణాటకలో ముస్లిం కోటాను రద్దు చేయడంపై భగ్గుమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని జనం భావోద్వేగాలతో ఆడుకుంటామంటే కుదదరని స్పష్టం చేశారు.
ఇది పూర్తిగా సమాజంలో ఉన్న మనుషుల మధ్య విభేదాలను సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin). ఇప్పటి వరకు ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. లౌకికవాదాన్ని కల్పించే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు సీఎం.
బీజేపీ ద్వేష పూరిత ఎజెండాను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు స్టాలిన్. ఇది మైనార్టీల పట్ల వారి ద్వేషాన్ని మాత్రమే బహిర్గం చేస్తుందన్నారు. కేంద్ర హోం మంత్రి ఎక్కడికి వెళ్లినా ఆయన తాను చేసే కామెంట్స్ అన్నీ విద్వేష పూరితంగానే ఉంటున్నాయని మండిపడ్డారు ఎంకే స్టాలిన్. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం వల్ల నష్ట పోయేది బీజేపీనేనని పేర్కొన్నారు. విద్వేషాలతో ఓట్లను పొందాలని అనుకోవడం దారుణమన్నారు ఎంకే స్టాలిన్(MK Stalin).
Also Read : శాంతికి..అభివృద్దికి కాంగ్రెస్ అవరోధం