CM MK Stalin: సీఎం స్టాలిన్‌ పై కన్నడ వాసుల ఆగ్రహం ! కారణమేమిటంటే ?

సీఎం స్టాలిన్‌ పై కన్నడ వాసుల ఆగ్రహం ! కారణమేమిటంటే ?

CM MK Stalin : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(CM MK Stalin) ఆదివారం తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్… ఇప్పుడు కొంతమంది కన్నడ వాసులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సీఎం స్టాలిన్…. తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందులో కన్నడిగులను ఆయన ద్రవిడులుగా పేర్కొనడం పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

CM MK Stalin-Kannada People

‘‘నూతన సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్‌ వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది ఐకమత్యంతో ఉండటం అత్యవసరం. మన హక్కులు, గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి’’ అని స్టాలిన్‌ ఆదివారం పోస్ట్‌ పెట్టారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగు, కన్నడలో రాశారు.

అయితే, ఈ పోస్ట్‌ కాస్తా సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంభోదించడంపై కొంతమంది కన్నడిగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘డీలిమిటేషన్‌, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ, మేం ద్రవిడులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు’’ అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు. అటు, టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌ కూడా దీనిపై స్పందిస్తూ స్టాలిన్‌ పై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీ ద్రవిడ మోడల్‌ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.

Also Read : Amit Shah: బిహార్‌ లో ఎన్నికల నగారా మోగించిన అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!