MK Stalin Senthil Balaji : సెంథిల్ ను ప‌రామ‌ర్శించిన స్టాలిన్

స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పినా ఈడీ విన‌లేదు

MK Stalin Senthil Balaji : జాబ్ స్కాంకు సంబంధించి మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని ఆరోపిస్తూ త‌మిళ‌నాడ‌కు చెందిన విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం తెల్ల‌వారుజామున అరెస్ట్ చేసింది. దీంతో ఉన్న‌ట్టుండి కుప్ప కూలారు మంత్రి. ఆ వెంట‌నే హుటా హుటిన ప్ర‌భుత్వ సూప‌ర్ స్పెషాలిటీకి త‌ర‌లించారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. మంత్రులు ఆస్ప‌త్రిలోని ఐసీయూలో ఉన్న ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన మంత్రులకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు ఈడీ.

ఇదిలా ఉండ‌గా చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ప‌రామ‌ర్శించారు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). ఈ సంద‌ర్బంగా నిప్పులు చెరిగారు కేంద్రంపై. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీకి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పినా ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. ఛాతిలో నొప్పి వ‌చ్చేలా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ మండిప‌డ్డారు. కేసుకు అవ‌స‌ర‌మైన చ‌ట్ట ప‌ర‌మైన విధానాల‌ను ఉల్లంఘిస్తూ ఈడీ ఆఫీసర్లు దారుణంగా ప్ర‌వ‌ర్తించారంటూ మండిప‌డ్డారు సీఎం ఎంకే స్టాలిన్. డీఎంకే ఈ సంఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా తీసుకుంటుంద‌న్నారు. 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్ప‌క త‌ప్ప‌ద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా అరెస్ట్ అయి, ఆస్ప‌త్రి పాలైన మంత్రి సెంథిల్ బాలాజీ గ‌తంలో అన్నాడీఎంకే స‌ర్కార్ లో ర‌వాణా శాఖ మంత్రిగా ప‌ని చేశారు. అనంత‌రం 2021లో డీఎంకేలో చేరారు. ఆ త‌ర్వాత మంత్రిగా కొలువు తీరారు.

Also Read : ZEE Sony Scrutiny : జీ గ్రూప్ మోసం సెబీ ఆగ్ర‌హం

 

Leave A Reply

Your Email Id will not be published!