Asaduddin Owaisi : సీఎం నితీశ్ కు ప‌శ్చాతాపం లేదు – ఓవైసీ

నిప్పులు చెరిగిన ఎంఐఎం చీఫ్

Asaduddin Owaisi : హైద‌రాబాద్ ఎంపీ , ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా బీహార్ లో పెద్ద ఎత్తున ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఓవైసీ. ఇదే స‌మ‌యంలో న‌లంద‌, రోహ‌తాస్ జిల్లాల్లో మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాకా నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు ఓవైసీ(Asaduddin Owaisi) .

ఈ అల్ల‌ర్ల‌కు నైతిక బాధ్య‌త వ‌హించాల్సింది సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ అని స్ప‌ష్టం చేశారు. ఒక రాష్ట్రంలో హింస జ‌రిగిన‌ప్పుడు దానికి బాధ్య‌త వ‌హించాల్సింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మేన‌ని పేర్కొన్నారు. బీహార్ ష‌రీఫ్ లోని మ‌ద‌ర్సా అజీజియాకు నిప్పు పెట్టారు. ముస్లింల దుకాణాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని ఆరోపించారు ఓవైసీ.

దీని వెనుక ప‌క్కా ప్లాన్ ఉంద‌న్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు న‌లంద సున్నిత‌మైన జిల్లా అని తెలిసినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేక పోయారంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌కు ప‌శ్చాతాపం అన్న‌ది లేద‌న్నారు ఓవైసీ(Asaduddin Owaisi) . నిన్న ఇఫ్తార్ కు హాజ‌ర‌య్యారు. కానీ సీఎం, డిప్యూటీ సీఎంలు ముస్లింల‌లో భ‌యాందోళ‌న‌లు సృష్టించాల‌ని అనుకుంటున్నారంటూ ఆరోపించారు.

Also Read : బీజేపీ కామెంట్స్ రాహుల్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!