Nitish Kumar : ఖర్గే..రాహుల్ తో నితీశ్ ములాఖత్
విపక్షాల ఐక్యతపై ఎడతెగని చర్చలు
Nitish Kumar : ఒక్క విజయం కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తే అదే గెలుపు విపక్షాల ఐక్యతకు బాటలు వేసేలా చేసింది. ఇది సిసలైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పక తప్పదు. తాజాగా దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జెండా ఎగుర వేయాలని తహ తహ లాడుతోంది భారతీయ జనతా పార్టీ.
ఈ మేరకు దేశంలో విపక్ష పార్టీలను, నేతలను లేకుండా చేయాలని అనుకుంటోంది. ఆ మేరకు పావులు కదుపుతూ వచ్చారు అమిత్ షా. కానీ ఊహించని రీతిలో కర్ణాటకలో వర్కవుట్ కాలేదు. మోదీ, షా, జేపీ నడ్డా చేసిన వ్యూహాలు పని చేయలేదు. జిమ్మిక్కులు, మ్యాజిక్కులు ఊసురుమనిపించేలా చేశాయి.
224 సీట్లకు గాను 136 సీట్లతో జయకేతనం ఎగుర వేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన అందరికంటే ఓ అడుగు ముందుకు వేశాడు. ఇప్పటికే సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ , నవీన్ పట్నాయక్ లను కలుసుకున్నారు. బెంగళూరు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా సోమవారం సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ నివాసంలో మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. చాలా సేపు దేశ రాజకీయాలు, విపక్షాల ఐక్యతపై చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో ఒక కొలిక్కి రానున్నట్లు జేడీయూ నేత లాలన్ సింగ్ , కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
Also Read : India Post Jobs 2023