Nitish Kumar : క‌రోనా ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా – నితీశ్

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సీఎం ఆగ్ర‌హం

Nitish Kumar : రాహుల్ గాంధీ చేప‌ట్టిన యాత్ర గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం, ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా రూల్స్ పాటించాల‌ని చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar). ఇదే క‌రోనా రూల్స్ గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టిన‌ప్పుడు ఎందుకు గుర్తుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు.

ఇదంతా కావాల‌ని చేస్తున్న రాజ‌కీయంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీహార్ సీఎం. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఎందుకు క‌రోనా విష‌యంలో వెనుక‌డుగు వేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌న్నారు నితీశ్ కుమార్. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని , దీనిని బీజేపీ ప‌రివారం, దాని సంస్థ‌లు త‌ట్టుకోలేక పోతున్నాయ‌ని ఆరోపించారు సీఎం.

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు నితీశ్ కుమార్. ఆయ‌న బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. మ‌హాఘ‌ట్ బంధ‌న్ పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూతో క‌లిసి సంకీర్ణ స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ కు అప్ప‌గించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కూడా కేబినెట్ లో చోటు క‌ల్పించారు. త‌మ రాష్ట్రంలో క‌రోనా పూర్తిగా నియంత్ర‌ణ‌లో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. మొత్తంగా క‌రోనా విష‌యంలో రాజ‌కీయం చేయ‌డంలో బీజేపీ ఆరి తేరింద‌ని నితీశ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : క‌రోనా క‌ల‌క‌లం కేంద్రం అప్ర‌మ‌త్తం

Leave A Reply

Your Email Id will not be published!