CM Revanth Reddy : ఇసుక దందాపై సీఎం రేవంత్ సర్కార్ ఘరం
దీనితో, సర్కార్ ఖజానాకు గండికొడుతున్నారు...
CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. వాగు కనిపిస్తే చాలు, తవ్వేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా… యదేచ్చగా ఇసుక దందాకు తెగపడుతున్నారు. ఈ జిల్లా, ఆ జిల్లా అన్న తేడా లేకుండా ఇసుకాసురులు ఇసుక రీచ్‌లను మింగేస్తున్నారు. దీనితో, సర్కార్ ఖజానాకు గండికొడుతున్నారు.
CM Revanth Reddy Slams
తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వాలంటే, టిజీఎండీసీ అనుమతులు అవసరం. ఇసుక కొనుగోళ్ల ప్రక్రియ టిజీఎండీసీ అద్వర్యంలో, అది కూడా ఆన్‌లైన్‌లో జరగాలి. కానీ టిజీఎండీసీ వెబ్‌సైట్‌లో ఓపెన్ కాకుండానే చాలా చోట్ల ఇసుక తరలిపోతుంది. ఉమ్మడి కరీంనగర్‌లోని తాడిచర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2, ఖమ్మపల్లి, ఉటూరు, సూర్యపేట్ జిల్లా వంగమర్తి, ములుగు ఇలా ప్రతి ఇసుక రీచ్‌ల నుంచి ప్రతిరోజు వందలకొద్ది లారీలు ఇసుకను తరలిస్తున్నారు. దోంగ బిల్లు, ఓవర్ లోడ్‌లతో దోచేస్తున్నారు.
ఇలా కోట్ల రూపాయల విలువైన ఇసుకను సాండ్ కేటుగాళ్ళు(Sand Mafia) దోచుకుంటున్నారు. దీనితో సర్కారుకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ, ప్రబుతి ఖజానాకు నష్టం జరగకూడదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్‌గా తీసుకున్నారు.
ఇసుక ద్వారా సర్కార్‌కు ఏడాదికి 6 వేల కోట్లకు పైగా ఆదాయం రావాల్సి ఉంది. ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుక అవసరం. విలువైన కొందరు దందాగా చేసుకోవడంపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది.
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గత మైనింగ్ సమీక్షలతో, ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందిస్తామని ప్రకటించిన ఆయన, దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ, ఇసుక దందా కొనసాగుతుండటంతో, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని, ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్కారుకు సహకరించన వారికి ప్రజా ప్రతినిధుల ద్వారా సూచనలు ఇవ్వడం జరిగింది.
Also Read : PM Modi : బీహార్ లో ఈ నెల 24న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ