CM Revanth Reddy : ఖ‌ర్గేతో రేవంత్ రెడ్డి భేటీ

ప్ర‌మాణ స్వీకారానికి రావాల‌ని ఆహ్వానం

CM Revanth Reddy : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రంలో నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరున రేవంత్ రెడ్డి హ‌స్తిన‌లో ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ను మ‌ర్యాద పూర్వ‌కంగా ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెంట ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు.

CM Revanth Reddy Meet Kharge

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చారు . సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు టీపీసీసీ చీఫ్‌. ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హ‌ర్షాతిరేక‌లు త‌యార‌య్యాయి.

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. పూర్తి మెజారిటీని సాధించింది. ఏ పార్టీపై ఆధార ప‌డ‌కుండా సింగిల్ లోగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంది.

బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు రాగా బీజేపీకి 8 సీట్లు , ఎంఐఎంకు 7 సీట్లు , సీపీఐకి ఒక సీటు ద‌క్కింది. ఇదిలా ఉండ‌గా సీపీఐ , కాంగ్రెస్ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉంది. కేబినెట్ లో చేరుతారా లేదా అన్న‌ది వేచి చూడాలి. రేపు జ‌రిగే ప్ర‌మాణ స్వీకారంలో కేబినెట్ ను కూడా ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Revanth Reddy : రేపే సీఎం ప‌ట్టాభిషేకం

Leave A Reply

Your Email Id will not be published!