CM Revanth Reddy : 21న జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రధాన శాఖల పని తీరుపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులైన ఐఏఎస్ లు, ఐపీఎస్ ల ను బదిలీ చేశారు.
CM Revanth Reddy Meeting with IAS Officers
ప్రధానంగా పోలీసు శాఖను ప్రక్షాళన చేపట్టారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ ల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 21న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ములాఖత్ కానున్నారు.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు పూర్తి వివరాలతో సిద్దంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయడం, మహాలక్ష్మి పథకం అమలు, ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా రూ. 10 లక్షలు వర్తింప చేయడం, ధరణి సమస్యలు, భూ రికార్డులపై ఆరా తీసే ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు సీఎస్.
Also Read : Srikanth Goud : శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు పరార్