CM Revanth Reddy : కలెక్టర్లు..ఎస్పీలకు సీఎం దిశా నిర్దేశం
లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. పాలనను పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. ఆదివారం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు గ్యారెంటీలను అమలు చేసింది. ఇందులో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10 లక్షల రూపాయల ఆరోగ్య భీమా సదుపాయం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.
CM Revanth Reddy Orders
తాజాగా మిగతా నాలుగు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాగైనా సరే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తప్పక అమలు కావాల్సిందేనంటూ ఆదేశించారు.
ప్రజా పాలన అనేది తమ ముఖ్యమైన ఎజెండా అని పేర్కొన్నారు. జనవరి నెలాఖరు లోపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. దీంతో ఇచ్చిన గ్యారెంటీల అమలు త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు సీఎం .
ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో సభలు నిర్వహించాలని ఆదేశించారు.
Also Read : Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్