Gautam Gambhir : గౌత‌మ్ గంభీర్ కామెంట్స్ వైర‌ల్

సంజూ శాంస‌న్ సెంచ‌రీ సెన్సేష‌న్

Gautam Gambhir : న్యూఢిల్లీ – భార‌త మాజీ క్రికెట‌ర్ , బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్(Gautam Gambhir) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ద‌క్షిణాఫ్రికా టూర్ లో భాగంగా కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు వ‌న్డే సీరీస్ కైవ‌సం చేసుకుంది. నిర్ణ‌యాత్మ‌క‌మైన కీల‌క‌మైన మూడ‌వ వ‌న్డే మ్యాచ్ లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ గెలుపులో కీల‌కమైన పాత్ర పోషించాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ . త‌న‌తో పాటు బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్ సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు.

Gautam Gambhir Shocking Comments

ఇక తొలుత బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. ఒకానొక ద‌శ‌లో 2 వికెట్లు కోల్పోయి 49 ప‌రుగుల వ‌ద్ద ఇబ్బందుల్లో ఉన్న టీమిండియాను త‌న అద్భుత‌మైన ఆట తీరుతో ప‌రుగులు పెట్టించాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు సంజూ శాంస‌న్. అసాధార‌ణ‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. త‌న కెరీర్ లో తొలి వ‌న్డే సెంచ‌రీ న‌మోదు చేశాడు కేర‌ళ స్టార్.

దీంతో క్రికెట్ దిగ్గ‌జాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కేఎల్ రాహుల్ అయితే ఏకంగా కోహ్లీ స్థానాన్ని భ‌ర్తీ చేసే ఛాన్స్ సంజూకి మాత్ర‌మే ఉంద‌న్నాడు. ఇక గ‌వాస్క‌ర్, సంజ‌య్ మంజ్రేక‌ర్ అయితే త‌నను ఇంత కాలం ఎందుకు దూరంగా ఉంచార‌ని ప్ర‌శ్నించారు బీసీసీఐని.

ఇదే స‌మ‌యంలో గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భ‌విష్య‌త్తులో వ‌న్డే ప‌రంగా ప్ర‌పంచంలోనే టాప్ లో ఉండే ఛాన్స్ సంజూ శాంస‌న్ కు ఉంద‌ని కితాబు ఇచ్చాడు.

Also Read : KL Rahul : కోహ్లీ స్థానంలో శాంస‌న్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!