Sunil Gavaskar : గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ కు ఫ్యూచ‌ర్

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ద‌క్షిణాఫ్రికా టూర్ లో కేఎల్ రాహుల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టింది. ప్ర‌ధానంగా ఆతిథ్య జ‌ట్టుకు చుక్క‌లు చూపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. కేవ‌లం 114 బంతులు మాత్ర‌మే ఆడిన సంజూ ఏకంగా 108 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. గ‌త కొంత కాలంగా త‌న‌ను ప‌క్క‌న పెడుతూ వ‌చ్చింది బీసీసీఐ.

Sunil Gavaskar Comments Viral

ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లి టూర్ లో త‌న‌ను ఎంపిక చేసింది. కేవ‌లం వ‌న్డే సీరీస్ కు మాత్ర‌మే ప‌రిమితం చేసింది. అత‌డిలో టెస్టు ప‌రంగా, టి20 ఫార్మాట్ ప‌రంగా ఆడే ద‌మ్ముంది సంజూ శాంస‌న్ కు. ఈ త‌రుణంలో గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

రాబోయే రోజుల్లో వ‌న్డే ప‌రంగా చూస్తే సంజూ శాంస‌న్ కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని పేర్కొన్నాడు. త‌ను ఏ ఫార్మాట్ లోనైనా ఆడే స‌త్తా క‌లిగిన ఆట‌గాడిగా కితాబు ఇచ్చాడు. సామాన్యంగా మ‌న‌కు అనుకూలంగా పిచ్ లు ద‌క్షిణాఫ్రికాలో ఉండ‌వ‌ని పేర్కొన్నాడు స‌న్నీ గ‌వాస్క‌ర్.

త‌ను ఏ స్థానంలోనైనా కుదురుకుని ఆడ‌గ‌ల‌డ‌ని, కావాల్సింద‌ల్లా మ‌రికొంత స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని సూచించాడు. భ‌విష్య‌త్తులో బీసీసీఐ సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు గ‌వాస్క‌ర్.

Also Read : KL Rahul : కోహ్లీ స్థానంలో శాంస‌న్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!