CM Revanth Reddy : కేసీఆర్ పై భగ్గుమన్న రేవంత్ రెడ్డి
నిర్బంధ నిరంకుశ పాలనకు నిదర్శనం
CM Revanth Reddy : హైదరాబాద్ – గతంలో తెలంగాణను ఏలిన కేసీఆర్ సర్కార్ ను ఏకి పారేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ లోకి ఎవరికీ అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజా యుద్ద నౌక గద్దరన్నను బయటే నిలబెట్టిన సంగతి ప్రజలు గమనించారని అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు.
CM Revanth Reddy Slams KCR
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టామని స్పష్టం చేశారు. ఇవాళ 4 కోట్ల మందికి అవకాశం కల్పించామని వెల్లడించారు సీఎం. తమది ప్రజా ప్రభుత్వమని , పదేళ్లలో ఒక్క అమర వీరుడి కుటుంబాన్నైనా ప్రగతి భవన్ లోకి రానిచ్చారా అని నిలదీశారు.
మలి దశ తెలంగాణ ఉద్యమానికి తన ప్రాణ త్యాగంతో ఊపిరి పోసిన శ్రీకాంతాచారి తల్లికి ఏమైనా పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులను నిట్ట నిలవునా మోసం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. వరి వేసుకుంటే ఉరేనంటూ రైతులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. అబద్దాలకు కేరాఫ్ గా గులాబీ నేతలు మారారంటూ ధ్వజమెత్తారు.
కాలువల ద్వారా నీళ్లు అందిస్తే విద్యుత్ మోటార్లు ఎందుకు పెరుగుతాయో ప్రతిపక్షాలు చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 25 లక్షల పంపు సెట్లు ఎలా వచ్చాయో ఆలోచించాలని అన్నారు.
Also Read : AP CM YS Jagan : జగన్ సంచలన నిర్ణయం
