CM Shinde : మాది ట్రిపుల్ ఇంజన్ సర్కార్
మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే
CM Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ తన సహచర ఎమ్మెల్యేలు 30 మందితో కలిసి షిండే , బీజేపీ సర్కార్ కు మద్దతు పలికారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు షఙండే, ఫడ్నవీస్.
రాజ్ భవన్ కు చేరుకున్న అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మరికొందరికి కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం ఏక్ నాథ్ షిండే(CM Shinde) మీడియాతో మాట్లాడారు. అజిత్ పవార్ , ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలకడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాజకీయ అనుభవం తమ సర్కార్ కు ఎంతగానో పనికి వస్తాయని చెప్పారు.
ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ సీఎంలు, సీఎంతో కలిపి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పరుగులు తీస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మిగతా పార్టీలు చేస్తున్న ఆరోపణలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు షిండే.
ప్రస్తుతం తన దృష్టి అంతా మహారాష్ట్రను అన్ని రంగాలలో ముందంజలో నిలపడమేనని పేర్కొన్నారు. ఇందు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు షిండే. ఇదిలా ఉండగా ఎన్సీపీ చీఫ్ పవార్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.
Also Read : Sharad Pawar : అజిత్ పవార్ జంప్ శరద్ పవార్ ఫైర్